AP Legislative Council: చైర్మన్‌ ఆదేశాలకు అడ్డుపడే అధికారం శాసనమండలి సెక్రటరీకి లేదు: యనమల

  • అడ్డుపడేందుకు ఆయన ఎవరు?
  • అమలు చేయకుంటే సభా ధిక్కారం అవుతుంది
  • సెలెక్ట్‌ కమిటీకి పేర్లు పంపాల్సిందే

  చైర్మన్‌ ఆదేశాలను శాసనమండలి సెక్రటరీ అడ్డుకోలేరని, ఆయనకు ఎటువంటి అధికారాలు లేవని టీడీపీ సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. సెలెక్ట్‌ కమిటీకి మండలిలో ప్రాతినిధ్యం ఉన్న పార్టీలు పేర్లు పంపాలని చైర్మన్‌ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినందున సెక్రటరీ వాటిని కచ్చితంగా అమలు చేయాలని, లేదంటే సభా ధిక్కారం కిందకు వస్తుందని హెచ్చరించారు. నిబంధనలు పాటించకుంటే తర్వాత అధికారులే చిక్కుల్లో పడతారని స్పష్టం చేశారు.

AP Legislative Council
chairman
Yanamala
select committe
  • Loading...

More Telugu News