Cellphone: ఇంటర్నేషనల్ కాల్ అటెండ్ చేస్తే... పేలిన సెల్ ఫోన్!

  • తమిళనాడులోని వేలూరు సమీపంలో ఘటన
  • తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స
  • కేసును విచారిస్తున్న పోలీసులు

ఓ ఇంటర్నేషనల్ కాల్ రావడంతో ఫోన్ ఆన్ చేయగానే, చేతిలో ఉన్న ఫోన్ పేలిన ఘటన తమిళనాడు, వేలూరు సమీపంలోని వాలాజలో జరిగింది. ఈ ఘటనలో బాధితుడు తీవ్ర గాయాలపాలై, ప్రస్తుతం వేలూరులోని అడుక్కంబరై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

వివరాల్లోకి వెళితే, స్థానిక నేతాజీ స్ట్రీట్ కు చెందిన వెంకటేశన్ (32) వృత్తిరీత్యా ఎలక్ట్రీషియన్. రాత్రి 8 గంటల సమయంలో అతని సెల్ కు విదేశీ నంబర్ తో కాల్ వచ్చింది. మాట్లాడేందుకు ప్రయత్నించేలోపే, అతి పెద్ద శబ్దంతో ఫోన్ పేలిపోయింది. ఇక కాల్ అటెండ్ చేస్తే, ఫోన్ ఎందుకు పేలుతుందన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. గాయపడ్డ వెంకటేశన్, పోలీసుల విచారణలో తన ఒంటిపై గాయాలకు పలు రకాల కారణాలు చెప్పినట్టు తెలుస్తోంది.

Cellphone
Blast
International Number
Police
Tamilnadu
Vellore
  • Loading...

More Telugu News