Summer: వేసవి వచ్చేస్తోంది... రాయలసీమలో పెరిగిన ఉష్ణోగ్రతలు!

  • తిరుపతి, కర్నూలులో 35 డిగ్రీల ఉష్ణోగ్రత
  • ఉక్కపోతను అనుభవించిన ప్రజలు
  • కోస్తాలోని కొన్ని ప్రాంతాల్లో కొనసాగుతున్న చలి

శీతాకాలం తొలగి, వేసవి వస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. బంగాళాఖాతంలో అధిక పీడనం కొనసాగుతుండగా, దీని ప్రభావంతో కోస్తా, రాయలసీమపైకి తేమగాలులు వీస్తున్నాయి. దీంతో రాయలసీమ, దక్షిణ కోస్తాల్లో ఎండ తీవ్రత ఒక్కసారిగా పెరిగింది. బుధవారం కర్నూలు, తిరుపతి, అనంతపురం, పట్టణాల్లో 35 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ప్రజలు ఉక్కపోతను అనుభవించాల్సి వచ్చింది. ఇదిలావుండగా, కోస్తాలోని కొన్ని ప్రాంతాల్లో చలి వాతావరణం కొనసాగుతోంది. పలు చోట్ల ఉదయం పూట మంచు కురిసింది.

  • Loading...

More Telugu News