Renu Desai: తల్లి పాత్రను ఇస్తామన్నారు... నేను చేయలేదు: రేణూ దేశాయ్

  • ఆరోగ్యం బాగాలేక చేయలేదు
  • 'చూసీ చూడంగానే' హిట్ అవుతుంది
  • ప్రీ రిలీజ్ వేడుకలో రేణూ దేశాయ్

'పెళ్లి చూపులు', 'మెంటల్ మదిలో' చిత్రాలను నిర్మించిన రాజ్ కందుకూరి, తన కుమారుడు శివను హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తూ నిర్మిస్తున్న 'చూసీ చూడంగానే' చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా వచ్చిన రేణూ దేశాయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమాలో తనకు తల్లి పాత్రను దర్శకుడు ఆఫర్ చేశారని, అయితే తనకు ఆరోగ్యం బాగాలేక చేయలేదని చెప్పారు. ఆ పాత్ర తనకు నచ్చిందని చెప్పారు.

తదుపరి చిత్రంలో అవకాశం ఇస్తే చేస్తానని, ఈ సినిమా సంగీతపరంగా హిట్ అవుతుందని భావిస్తున్నానని అన్నారు. సినీ పరిశ్రమలోకి మహిళా టెక్నీషియన్లు ఎక్కువమంది రావాలని తాను కోరుకుంటున్నట్టు తెలిపారు. మేల్ డైరెక్టర్, ఫిమేల్ డైరెక్టర్ అన్న భేదాభిప్రాయాలు తొలగిపోవాలన్నది తన అభిమతమని అన్నారు. కాగా, ఈ చిత్రంలో శివ సరసన వర్ష, మాళవిక హీరోయిన్లుగా నటించారు. 

Renu Desai
Chusi Chudangane
Pre Release Event
  • Loading...

More Telugu News