Petrol: పెట్రోలు, డీజిల్ పై వ్యాట్ వసూలుకు సంబంధించి స్వల్ప సవరణలు

  • లీటర్ పెట్రోల్ పై ఇక నుంచి 35.2 శాతం వ్యాట్
  • లీటర్ డీజిల్ పై  వ్యాట్ 27 శాతంగా నిర్ణయం
  • ఉత్తర్వులు జారీ చేసిన కేంద్రం

దేశంలో పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ వసూళ్లకు సంబంధించి కేంద్రం స్వల్పంగా సవరణలు చేసింది. లీటర్ పెట్రోల్ పై ఇక నుంచి 35.2 శాతం వ్యాట్ వసూలు చేయాలని నిర్ణయించారు. లీటర్ డీజిల్ పై ఇకమీదట 27 శాతం వ్యాట్ వసూలు చేయనున్నారు. ఇప్పటివరకు అదనంగా వసూలు చేస్తున్న రూ.2ను పన్నులోనే కలిపివేశారు. ఈ మేరకు కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది.

Petrol
Diesel
Vat
NDA
  • Loading...

More Telugu News