CoronaVirus: ఏపీలో కరోనా వైరస్ గురించి ఆందోళన చెందనక్కర్లేదు: విజయసాయిరెడ్డి

  • ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ తో భయాందోళనలు
  • ఏపీలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదన్న విజయసాయి
  • రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ సిద్ధంగా ఉందని వెల్లడి

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ గురించి తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతున్న తరుణంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ లో స్పందించారు. 'చైనాలో కరోనా వైరస్ ప్రబలుతోందని, దేశంలోని అనేక ప్రాంతాల్లోనూ కరోనా వైరస్ ఉనికి కనిపిస్తోందని వార్తలు వస్తున్నాయి. అయితే ఏపీలో ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదు. ఇప్పటివరకు ఎలాంటి ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. ఎలాంటి ఉపద్రవం వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ సిద్ధంగా ఉంది' అని పేర్కొన్నారు.

CoronaVirus
Vijay Sai Reddy
China
Andhra Pradesh
India
  • Loading...

More Telugu News