YSRCP: చంద్రబాబు, పవన్, కన్నా.. ముగ్గురూ అభివృద్ధి నిరోధకులే: ఏపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు

  • గత టీడీపీ ప్రభుత్వం అభివృద్ధిని విస్మరించింది
  • సీఎం జగన్ కు ప్రజల అండ ఉంది

చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్, కన్నా లక్ష్మీనారాయణ ముగ్గురూ ఒకే డైరెక్షన్ లో పనిచేస్తూ రాష్ట్ర అభివృద్ధికి నిరోధకులుగా తయారయ్యారని, ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు విమర్శించారు. సీఎం జగన్మోహన్ రెడ్డికి ప్రజల అండ ఉందని, రాష్ట్ర అభివృద్ధికి ఆయన చిత్తశుద్ధితో పని చేస్తున్నారని అన్నారు. సీఎం విజయవాడ నగర అభివృద్ధికి కట్టుబడి ఉన్నారన్నారు. ఈ రోజు మంత్రి వెల్లంపల్లి నగరంలో రూ.2 కోట్లతో పలుచోట్ల అభివృద్ధి పనులు ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాలుగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీ.. అభివృద్ధిని విస్మరించిందన్నారు. పలు డివిజన్లలో అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉందని చెప్పారు. పశ్చిమ నియోజకవర్గంలో సీసీ రోడ్డు నిర్మాణం, డ్రైనేజీ వ్యవస్థ పునరుద్ధరించడం, తాగునీటి సౌకర్యం మెరుగుపరచడం వంటి అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు విడుదల చేయడం జరిగిందని తెలిపారు.


YSRCP
Minister
Vellampalli Srinivasa Rao
Andhra Pradesh
  • Loading...

More Telugu News