Ratan Tata: రతన్ టాటాకు పాదాభివందనం చేసిన 'ఇన్ఫోసిస్' నారాయణమూర్తి

  • ట్రైకాన్ అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్న పారిశ్రామిక వేత్తలు
  • జీవనకాల సాఫల్య పురస్కారం అందుకున్న టాటా
  • టాటాకు అవార్డు ప్రదానం చేసిన నారాయణమూర్తి

ట్రైకాన్ 11వ వార్షిక అవార్డుల కార్యక్రమం సందర్భంగా ఇన్ఫోసిస్ కో ఫౌండర్ నారాయణమూర్తి పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా పాదాలకు నమస్కారం చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో పారిశ్రామిక వేత్తలకు అవార్డులు ప్రదానం చేశారు. టాటాను జీవనకాల సాఫల్య పురస్కారంతో సత్కరించారు. ఈ అవార్డును రతన్ టాటాకు నారాయణమూర్తి అందించారు.

అనంతరం నారాయణమూర్తి, రతన్ టాటా పాదాలకు నమస్కరించారు. ఈ ఫొటోలను నిర్వాహకులు ట్విట్టర్ సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా టాటా మాట్లాడుతూ.. ‘గొప్ప స్నేహితుడైన నారాయణ మూర్తి నుంచి అవార్డు అందుకోవడం గర్వంగా ఉందని’ ఆనందం వ్యక్తం చేశారు.

Ratan Tata
Infosys co founder
Narayana Murthy
Trikon Awards
  • Loading...

More Telugu News