Prashant Kishor: ప్రశాంత్ కిశోర్ కు షాక్... జేడీయూ నుంచి బహిష్కరణ

  • నితీశ్ కుమార్ కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన పీకే
  • క్రమశిక్షణ చర్యలు తీసుకున్న అధిష్ఠానం
  • ప్రస్తుతం టీఎంసీ కోసం పని చేస్తున్న పీకే

జనతాదళ్ యునైటెడ్ (జేడీయూ) పార్టీలో నితీశ్ కుమార్ తర్వాత రెండో స్థానంలో ఉన్న ప్రశాంత్ కిశోర్ కు ఆ పార్టీ అధినాయకత్వం షాక్ ఇచ్చింది. పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. పార్టీ అధినేత నితీశ్ కుమార్ ను ఉద్దేశించి బహిరంగంగా విమర్శనాత్మక వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో, ప్రశాంత్ కిశోర్ పై ఆ పార్టీ కన్నెర్ర చేసింది. క్రమశిక్షణా రాహిత్యంగా వ్యవహరించారంటూ ఏకంగా పార్టీ నుంచి వెళ్లగొట్టింది. మరోవైపు ఎన్నికల వ్యూహకర్తగా పేరుగాంచిన పీకే... వైసీపీ సహా పలు పార్టీల కోసం పని చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం మమత బెనర్జీకి చెందిన టీఎంసీ కోసం ఆయన పని చేస్తున్నారు.

Prashant Kishor
JDU
Nitish Kumar
  • Loading...

More Telugu News