Nara Lokesh: రిపోర్టులు మార్చడం జగన్ కు వెన్నతో పెట్టిన విద్య: నారా లోకేశ్

  • నివేదికల్లోని వాస్తవాలు తొక్కిపెట్టారంటూ ఆరోపణ
  • వినాశకారి అంటూ వ్యాఖ్యలు
  • ట్విట్టర్ లో స్పందించిన లోకేశ్

ఏపీ సీఎం జగన్ పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శనాస్త్రాలు సంధించారు. జీఎన్ రావు, బీసీజీ కమిటీ నివేదికల్లోని అసలు నిజాలను తొక్కిపెట్టి, మూడు ముక్కలాట మొదలుపెట్టారని మండిపడ్డారు. రిపోర్టులు మార్చడం జగన్ కు వెన్నతో పెట్టిన విద్య అని, ఇసుక నుంచి తైలం తీసి అవినీతి సామ్రాజ్యాన్ని నిర్మించిన వినాశకారి ఇప్పుడు రాష్ట్రాన్ని నాశనం చేయాలని కంకణం కట్టుకున్నాడని ఆరోపించారు. చేసిన దొంగ పనులు బయటపడతాయన్న భయంతో మండలిలో బిల్లు సెలెక్ట్ కమిటీకి వెళ్లగానే జగన్ ఉలిక్కిపడ్డారని లోకేశ్ ట్వీట్ చేశారు.

Nara Lokesh
Jagan
GN Rao Committee
BCG Committee
Report
Vizag
AP Capital
  • Loading...

More Telugu News