RRR movie: రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’లో మరో హీరోయిన్!

  • రామ్ చరణ్ సరసన బాలీవుడ్ నటి అలియా భట్
  • ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ నటి ఒలీవియా మోరిస్  
  • అజయ్ దేవగణ్ కు జంటగా టాలీవుడ్ నటి శ్రియ

‘ఆర్ఆర్ఆర్’ ప్రతి నాయకుడిగా నటిస్తున్న బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ సరసన నటించడానికి టాలీవుడ్ నటి శ్రియను ఎంపిక చేశారని తెలుస్తోంది. దీనిపై చిత్రబృందం అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంది. శ్రియ ఇప్పటికే దర్శకుడు రాజమౌళితో కలిసి ఓ సినిమా చేసింది. ఈ సినిమాలో హీరోలుగా నటిస్తున్న రామ్ చరణ్ సరసన బాలీవుడ్ హీరోయిన్ అలియాభట్ నటిస్తుండగా, మరో హీరో ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ హీరోయిన్ ఒలీవియో మోరిస్ నటిస్తోంది. మొత్తంగా ఈ సినిమాలో వేరు వేరు సినీ ఇండస్ట్రీలకు చెందిన ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు. శ్రియ ఇక అజయ్ దేవగణ్ తో నటిస్తున్న రెండో చిత్రమిది. గతంలో 'దృశ్యం' చిత్రం రీమేక్ లో అజయ్ సరసన ఆమె నటించింది.

RRR movie
Heroines
Shriya
Aliabatt
Olivio moris
Tollywood
  • Loading...

More Telugu News