Nara Lokesh: గొర్రెలకే కాదు పిచ్చికుక్కలకు కూడా నా వద్ద వైద్యం ఉంది: వల్లభనేని వంశీ

  • గొర్రెలతో పాటు గొర్రెల డాక్టర్ ను కూడా కొన్నారన్న లోకేశ్
  • మంగళగిరిలో చిత్తుగా ఓడిపోయారన్న వంశీ
  • మండలి కూడా రద్దు కావడంతో పిచ్చి పట్టిందంటూ వ్యాఖ్య

టీడీపీ నేత నారా లోకేశ్ సోషల్ మీడియాలో పెట్టిన ఒక పోస్ట్ చర్చనీయాంశంగా మారింది. సంతలో గొర్రెలను కొన్నట్టు టీడీపీ నేతలు వల్లభనేని వంశీ, మద్దాలి గిరి, పోతుల సునీతలను వైసీపీ కొనేసిందని లోకేశ్ కామెంట్ చేశారు. వీరి ఫొటోలతో ఉన్న వీడియోను పోస్ట్ చేశారు. గొర్రెలతో పాటు గొర్రెల డాక్టర్ ను కూడా కొన్నారని వ్యాఖ్యానించారు.

ఈ వ్యాఖ్యలపై గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మండిపడ్డారు. వద్దని చెప్పినా వినకుండా వెళ్లి మంగళగిరిలో పోటీ చేసి చిత్తుగా ఓడిపోయారని నారా లోకేశ్ ను ఉద్దేశించి ఎద్దేవా చేశారు. ఇప్పుడు శాసనమండలి కూడా రద్దు కావడంతో ఆయనకు పిచ్చి పట్టిందని... పిచ్చిపిచ్చి కామెంట్లు చేస్తున్నారని అన్నారు. గొర్రెలకే కాదు పిచ్చికుక్కలకు కూడా తన వద్ద వైద్యముందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Nara Lokesh
Vallabhaneni Vamsi
Telugudesam
YSRCP
  • Loading...

More Telugu News