YSRCP: కేంద్రం నుంచి సమాచారం రాగానే.. మంత్రి పదవులకు మేమిద్దరం రాజీనామా చేస్తాం: మంత్రి మోపిదేవి

  • 'మండలి' రద్దు నేపథ్యంలో 'రాజీనామా' వ్యాఖ్యలు 
  • రాజీనామాలకు కొన్ని పద్ధతులు ఉంటాయి
  • వ్యవసాయ రంగానికి సీఎం అధిక ప్రాధాన్యతనిస్తున్నారు  

శాసనమండలి రద్దుకు ఇటీవల ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. దీంతో మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్‌తో పాటు మోపిదేవి వెంకటరమణ రాజీనామా చేస్తారని ప్రచారం జరిగింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా పోటీ చేసి ఓడిపోయిన పిల్లి సుభాష్ చంద్రబోస్‌, మోపిదేవి వెంకట రమణ ఎమ్మెల్సీలుగా కొనసాగుతున్నారు.

ఈ నేపథ్యంలో మంత్రి పదవులకు రాజీనామా చేస్తారా? అన్న ప్రశ్నకు మోపిదేవి స్పందించారు. ఈ రోజు మోపిదేవి అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ.. 'రాజీనామా చేస్తాం.. అయితే, రాజీనామాలకు కొన్ని పద్ధతులు ఉంటాయి. మండలి రద్దు తర్వాత కేంద్రం నుంచి సమాచారం వచ్చాక రాజీనామా చేస్తాం' అని స్పష్టతనిచ్చారు.

కాగా,  వ్యవసాయ రంగానికి సీఎం అధిక ప్రాధాన్యతనిస్తున్నారని అలాగే, ఆక్వా రంగానికి కూడా ప్రాధాన్యత నిచ్చి ప్రకాశం, గుంటూరు జిల్లాల ఓడరేవులతో పాటు ఉప్పాడలో ఫిషింగ్ జెట్టిలను అభివృద్ధి చేస్తున్నారని చెప్పారు.

YSRCP
Amaravati
Andhra Pradesh
Mopidevi Venkataramana
  • Loading...

More Telugu News