Narendra Modi: దేశ ఆర్థిక వ్యవస్థను ఇలా తారుమారు చేసేశారు: 'బడ్జెట్' నేపథ్యంలో రాహుల్ గాంధీ ట్వీట్
- గతంలో దేశ జీడీపీ 7.5 శాతం
- ద్రవ్యోల్బణం 3.5 శాతం
- ఇప్పుడు మాత్రం జీడీపీ 3.5 శాతం
- ద్రవ్యోల్బణం 7.5 శాతం
'మోదీతో పాటు ఆయనకు తగ్గ ఆర్థిక సలహాదారుల బృందం ఆర్థిక వ్యవస్థను తారుమారు చేసింది' అంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. గతంలో దేశ జీడీపీ 7.5 శాతంగా, ద్రవ్యోల్బణం 3.5 శాతంగా ఉండేదని పేర్కొన్నారు. ఇప్పుడు మాత్రం జీడీపీ 3.5 శాతంగా, ద్రవ్యోల్బణం 7.5 శాతంగా ఉందని విమర్శించారు.
కుదేలైన ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దేందుకు తదుపరి ఏం చేయాలన్న విషయంపై ప్రధాని మోదీతో పాటు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి వద్ద ఎటువంటి పరిష్కార మార్గం లేదని ఆయన ట్వీట్ చేశారు. ఫిబ్రవరి 1న పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఈ నేపథ్యంలోనే రాహుల్ గాంధీ ఈ విమర్శలు చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థను మోదీ సర్కారు సర్వనాశనం చేస్తోందని కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి విమర్శలు చేస్తోన్న విషయం తెలిసిందే.