sunilrao: సునీల్‌రావును వరించిన కరీంనగర్‌ మేయర్‌ పీఠం!

  • అధికారికంగా ప్రకటించిన టీఆర్‌ఎస్‌ అధిష్ఠానం
  • ఈరోజు 11 గంటలకు ప్రమాణ స్వీకారం
  • మొత్తం 60 డివిజన్లకుగాను 33 గెల్చుకున్న టీఆర్‌ఎస్‌

సీనియర్‌ నాయకుడు సునీల్‌రావును కరీంనగర్‌ మేయర్‌ పీఠం వరించింది. మేయర్‌గా ఆయన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తూ టీఆర్‌ఎస్‌ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది. కరీంనగర్‌ కార్పొరేషన్‌లోని మొత్తం 60 డివిజన్లకుగాను 33 డివిజన్లను  గెల్చుకుని టీఆర్‌ఎస్‌ ఇక్కడ అధిక్యం సాధించింది. బీజేపీ 13, ఎంఐఎం 7 డివిజన్లలో గెలుపొందగా మరో ఏడు డివిజన్లు స్వతంత్ర అభ్యర్థుల పరమయ్యాయి. అయితే స్వతంత్రులంతా గంపగుత్తగా టీఆర్‌ఎస్‌లో చేరిపోవడంతో ప్రస్తుతం ఆ పార్టీ బలం కార్పొరేషన్‌లో 40కి చేరింది. మూడింట రెండొంతుల మెజార్టీకి చేరుకున్న టీఆర్‌ఎస్‌ అధిష్ఠానం మేయర్‌ పీఠానికి సునీల్‌రావును ఎంపిక చేయడంతో ఈరోజు ఉదయం 11 గంటకు ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

sunilrao
TRS
Karimnagar District
Mayor
Municipal Elections
Municipal Corporation
  • Loading...

More Telugu News