Balakrishna: మరోసారి బాలకృష్ణతో జత కడుతున్న అంజలి

  • బోయపాటి నుంచి మరో యాక్షన్ ఎంటర్టైనర్ 
  •  ఫిబ్రవరి 15నుంచి రెగ్యులర్ షూటింగ్ 
  • సంగీత దర్శకుడిగా తమన్

ఇటు తెలుగులోను .. అటు తమిళంలోను కథానాయికగా అంజలి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. ఈ మధ్య అవకాశాలు తగ్గినా సరైన హిట్ కోసం ఎదురుచూస్తూ తనకి వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటోంది. మరిన్ని అవకాశాల కోసం బరువు కూడా తగ్గింది. తెలుగు నుంచి ఒక భారీ సినిమా ఛాన్స్ కోసం ఎదురుచూస్తున్న అంజలికి, బాలకృష్ణ సినిమాలో నటించే అవకాశం మరోసారి వచ్చిందని అంటున్నారు.

గతంలో ఆమె బాలకృష్ణ సరసన 'డిక్టేటర్' సినిమా చేసింది. ఇప్పుడు బాలకృష్ణ హీరోగా బోయపాటి ఒక యాక్షన్ ఎంటర్టైనర్ ను రూపొందించనున్నాడు. వచ్చేనెల 15 నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. ఈ సినిమాలో కథానాయికగా అంజలి పేరు ఖరారైపోయినట్టేనని అంటున్నారు. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాకి. తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

Balakrishna
Anajli
Boyapati Sreenu Movie
  • Loading...

More Telugu News