Sucide: భార్య అందంగా వుందని భర్త వేధింపులు... ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న యువతి!

  • కర్ణాటకలోని బొమ్మనహళ్లిలో ఘటన
  • అందంగా ఉందన్న కారణంతో నిత్యమూ గొడవలు
  • తల్లిదండ్రులు తీసుకెళ్లేలోపే సూసైడ్

తన భార్య తనకన్నా అందంగా ఉందన్న ఈర్ష్యతో, నిత్యమూ వేధిస్తుంటే, వాటిని తట్టుకోలేని ఓ యువతి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కర్ణాటకలోని బొమ్మనహళ్లి సమీపంలో జరిగిన ఘటన వెనుక పోలీసులు వెల్లడించిన వివరాల్లోకి వెళితే...

మాదప్పనహళ్లికి చెందిన సుబ్రమణి అనే యువకుడికి హొసకోటెకు చెందిన జయశ్రీ (26)తో రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. ఆమె చాలా అందంగా ఉండటాన్ని సహించలేకపోయిన సుబ్రమణి, ఆత్మన్యూనత చెందేవాడు. భార్యను బయటకు తీసుకెళ్లేందుకు నిరాకరించేవాడు. గుడికి వెళితే, తన పక్కన నిలబడనిచ్చేవాడు కాదు. ఇంట్లో ముస్తాబైతే, ఎందుకు తయారవుతున్నావని వేధించేవాడు.

తాను ఓ సినిమాను తీయాలని అనుకుంటున్నానని, పుట్టింటి నుంచి డబ్బులు తేవాలని గత కొంతకాలంగా వేధిస్తుంటే, తన బాధను ఆమె తల్లిదండ్రులకు చెప్పుకుని బాధపడింది. వారు వచ్చి పంచాయతీ పెట్టి నచ్చజెప్పినా సుబ్రమణి మారలేదు. మరిన్ని వేధింపులకు ఆమెను గురి చేశాడు.

ఈ క్రమంలో తానింక భర్త దగ్గర ఉండలేనని ఆమె తల్లిదండ్రుల వద్ద మొరపెట్టుకుంది. రెండు రోజుల్లో తీసుకెళతామని వారు అనునయించారు. అదే రోజు రాత్రి ఆమె ఉరి వేసుకున్న స్థితిలో విగతజీవిగా కనిపించింది. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు రిజిస్టర్ చేసి, సుబ్రమణిని అరెస్ట్ చేశారు. తమ బిడ్డను భర్తే దారుణంగా హత్య చేసి, ఉరేసుకుందని నాటకం ఆడుతున్నాడని తల్లిదండ్రులు కేసు పెట్టారు.

Sucide
Karnataka
Jayasri
Beautiful
Harrasment
  • Loading...

More Telugu News