GN Rao Committee: విశాఖను రాజధానిని చేస్తే వచ్చే అడ్డంకులు ఇవే!: తాజాగా వెలుగులోకి జీఎన్‌రావు కమిటీ నివేదికలోని హెచ్చరికలు

  • విశాఖ సున్నితమైన ప్రాంతం
  • తుపానులు, వరద ముప్పు ఎక్కువ
  • భూగర్భ జలాల్లో ఉప్పు నీరు చేరుతుంది

రాజధానిపై ఏపీ ప్రభుత్వం నియమించిన జీఎన్ రావు కమిటీ ఇచ్చిన నివేదికలో ఓ కొత్త విషయం వెలుగు చూసింది. విశాఖపట్టణాన్ని రాజధానిని చేస్తే వచ్చే అడ్డంకులు ఏంటన్నవి వివరంగా పేర్కొంది. పర్యావరణ పరంగా విశాఖ చాలా సున్నితమైన ప్రాంతమని, ఇక్కడ తుపానులు, వరదలతో ముప్పు పొంచి వుందని స్పష్టం చేసింది. అలాగే, కోస్టల్  రెగ్యులేటరీ జోన్‌లకు ఉండే అడ్డంకులు, భూగర్భ జలాల్లో ఉప్పు నీరు చేరడం వంటి సమస్యలున్నాయని కమిటీ స్పష్టంగా పేర్కొంది.

జీఎన్ రావు కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారమే విశాఖను మూడు రాజధానుల్లో ఒకటిగా పేర్కొన్న ప్రభుత్వం.. ఆ కమిటీ పేర్కొన్న అవరోధాలను మాత్రం వెల్లడించలేదు. తాజాగా, ఇవి వెలుగులోకి రావడం చర్చనీయాంశమైంది. మూడు రాజధానులను వ్యతిరేకిస్తున్న ప్రతిపక్షాలకు మరో ఆయుధం దొరికినట్టు అయింది.

GN Rao Committee
Visakhapatnam District
Amaravati
  • Loading...

More Telugu News