Tollywood: టాలీవుడ్‌లో విషాదం.. గుండెపోటుతో నటుడు జాన్ కన్నుమూత!

  • పలు చిత్రాల్లో నటించిన జాన్
  • నిన్న రాత్రి గుండెపోటుతో మృతి
  • తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన టాలీవుడ్ ప్రముఖులు

టాలీవుడ్‌లో విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు, రచయిత జాన్ గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందారు. కేరళకు చెందిన జాన్ హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి, ప్రగతినగర్‌లో ఉంటున్నారు. నిన్న రాత్రి గుండెపోటుతో  ఒక్కసారిగా కుప్పకూలి ప్రాణాలు విడిచారు. నేడు ఆయన భౌతికకాయాన్ని స్వస్థలం కేరళ తరలిస్తారు.

ఫలక్‌నుమా దాస్, మను, రక్తం, యుద్ధం శరణం తదితర చిత్రాల్లో నటించిన జాన్.. చివరిసారి ‘గాడ్’ అనే వెబ్ సిరీస్‌లో నటించారు. జాన్ మరణవార్తను దర్శకుడు సాయి రాజేశ్ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. చిత్ర పరిశ్రమలోని ప్రముఖులతో జాన్‌కు సన్నిహిత సంబంధాలున్నాయి. ఆయన మరణవార్త తెలిసి టాలీవుడ్ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దర్శకుడు సాయి రాజేశ్‌, నటుడు సత్యదేవ్, నటి గాయత్రీ గుప్తా తదితరులు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.

Tollywood
Actor jahn
heart attack
Hyderabad
  • Loading...

More Telugu News