Man vs Wild: ‘మ్యాన్ వర్సెస్ వైల్డ్’ షూటింగ్ లో రజనీకాంత్ కు స్వల్ప గాయాలు

  • బండిపుర అడవుల్లో షూటింగ్ సమయంలో ప్రమాదం
  • డిస్కవరీ ఛానెల్లో అత్యంత ప్రజాదరణ పొందిన షో
  • ఈ షోలో పాల్గొంటున్న రెండో భారతీయుడు రజనీ
  • డిస్కవరీ ఛానెల్లో కన్పించిన తొలి భారతీయుడిగా ప్రధాని మోదీ

డిస్కవరీ ఛానెల్లో అత్యంత ప్రజాదరణ పొందిన, ‘మ్యాన్ వర్సెస్ వైల్డ్’ కార్యక్రమం కోసం బేర్ గ్రిల్స్ తో పాటు షూటింగ్ లో పాల్గొంటున్న సూపర్ స్టార్ రజనీకాంత్  స్వల్పంగా గాయపడ్డారు. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న రెండో భారతీయుడు రజనీ. గత ఏడాది డిస్కవరీ చానల్ లో ప్రధాని మోదీ తొలిసారిగా కనిపించారు. బేర్ గ్రిల్స్ టీం తాజా ఎపిసోడ్ ను కర్ణాటకలోని బండిపుర అడవుల్లో చిత్రీకరిస్తోంది.

మూడు రోజులు పాటు ఈ అడవుల్లో షూటింగ్ జరపనున్నారు. ప్రకృతి అంటే అమితంగా ఇష్టపడే రజనీకాంత్ ఈ మూడురోజులు షూటింగ్ లో పాల్గొంటూ ఆ అడవుల్లోనే ఉండనున్నారు. షూటింగ్ తొలిరోజు మంగళవారం బండిపుర అడవుల్లో షూటింగ్ చేస్తున్న సమయంలో రజనీకాంత్  కుడిభుజానికి స్వల్ప గాయమైందని సమాచారం.  

బేర్ గ్రిల్స్ ఈ కార్యక్రమంలో భాగంగా అడవులు, నదులు, కొండల్లో తిరుగుతూ.. సాహసాలు చేస్తుంటారు. అడవుల్లో తన వెంట ఎలాంటి ఆహారాన్ని తీసుకోకుండా, అడవుల్లో దొరికే ప్రాణులు, దుంపలు తింటూ మానవుడు సహజంగా ఎలా బ్రతకగలడో ప్రేక్షకులకు చూపిస్తుంటారు. అదేవిధంగా తన ప్రయాణంలో ఎదురయ్యే ప్రతికూలతలను ఎలా ఎదుర్కొంటాడో చిత్రీకరిస్తారు. ఈ షో అంతర్జాతీయంగా అత్యంత ప్రజాదరణ పొందింది.

Man vs Wild
Shooting
Rajnaikanth minor inury
Bandipur forests
Karnataka
  • Loading...

More Telugu News