local bodies: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు.. జనసేన,బీజేపీ పొత్తు ఖరారు!
- అమరావతిలో ప్రస్తుత పరిస్థితికి వైసీపీ, టీడీపీలే కారణం
- అమరావతి రైతులకు భరోసా కల్పించడానికి బృందం ఏర్పాటు
- రాజధాని మార్పుపై కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించలేదు
ఆంధ్రప్రదేశ్ లో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ, జనసేన మధ్య పొత్తు ఖరారైంది. తాజాగా ఈ రెండు పార్టీల నేతలు విజయవాడ వేదికగా సమన్వయ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ భేటీలో.. త్వరలో రాష్ట్రంలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కలసి పోటీ చేయడానికి ఇరు పార్టీలు పొత్తు కుదుర్చుకున్నాయి.
అమరావతి రైతులను కలవడానికి రెండు పార్టీలకు చెందిన సభ్యులతో ఒక బృందాన్ని ఏర్పాటు చేయాలని కమిటీ నిర్ణయించింది. ఈ బృందం అమరావతి రాజధాని రైతులను కలిసి వారికి భరోసా కల్పిస్తుందని సమన్వయ కమిటీ తెలిపింది. అమరావతిలో ప్రస్తుత పరిస్థితికి వైసీపీ, టీడీపీలే కారణమని కమిటీ పేర్కొంది. రాజధాని మార్పుపై కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించామన్న ప్రచారాన్ని సమన్వయ కమిటీ తోసిపుచ్చింది. అధికార పార్టీ, విపక్ష పార్టీలు ఈ విషయంలో తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడింది. ప్రతీ పదిహేను రోజులకొకసారి సమావేశమవ్వాలని సమన్వయ కమిటీ నిర్ణయించింది.