YSRCP: శాసనమండలి రద్దుపై తప్పకుండా విజయం సాధిస్తాం: వైసీపీ నేత విజయసాయిరెడ్డి

  • మండలి రద్దుపై చట్టప్రకారం కేంద్రాన్ని కోరుతున్నాం
  • అమరావతి చుట్టూ  వేల ఎకరాలను సుజనా కొన్నారు
  • సుజనా చౌదరి, చంద్రబాబు ప్రయత్నాలు నెరవేరవు

ఏపీ శాసనమండలిని రద్దు చేయాలని చట్ట ప్రకారం కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నామని  వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పారు. విశాఖలో ఇవాళ పర్యటించిన ఆయన్ని మీడియా పలకరించింది. ఈ సందర్భంగా శాసనమండలి రద్దు తీర్మానంపై ప్రశ్నించగా ఆయన స్పందిస్తూ, ఈ విషయంలో తప్పకుండా విజయం సాధిస్తామని అన్నారు.

వికేంద్రీకరణను, రాజధాని తరలింపును కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కూడా వ్యతిరేకిస్తోందన్న ప్రశ్నకు విజయసాయిరెడ్డి స్పందిస్తూ, ఈ విషయం తనకు తెలియదు గానీ, సుజనా చౌదరి మాత్రం దీనిని వ్యతిరేకిస్తున్నారని, ఎందుకంటే, అమరావతి చుట్టూ కొన్ని వేల ఎకరాలను కొనుగోలు చేశారని ఆరోపించారు. బ్యాంకులను మోసం చేయడం, ధనార్జన చేయడమే సుజనా ధ్యేయమని తీవ్ర విమర్శలు చేశారు. ప్రజాప్రయోజనాలను విస్మరిస్తూ స్వప్రయోజనాల కోసం అహర్నిశలు పని చేస్తున్న సుజనా చౌదరి, చంద్రబాబు నాయుడి ప్రయత్నాలు నెరవేరవని అన్నారు.

YSRCP
Vijayasai Reddy
mp
Sujana Chowdary
  • Loading...

More Telugu News