karona virus: కరోనా వైరస్ భయంతో.. ‘కరోనా బ్రాండ్ బీర్ల’ అమ్మకాలు డౌన్!

  • ఇది తాగితే.. కరోనా వైరస్ సోకుతుందని భయం
  • పేరులో సామీప్యత ఉండటంతో బీరు ప్రియులకు అనుమానం  
  • నివృత్తికోసం గుగూల్ లో వెతుకులాట 

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ తాజాగా భారత్ లో బీర్ల అమ్మకాలకు గండికొడుతోందని ఆ కంపెనీ వాపోతోంది. భారత్ లో ఇప్పటివరకు ఈ వైరస్ బారిన పడ్డట్లు కేసులు నమోదు కానప్పటికీ.. ఈ వైరస్ వ్యాపించిందేమోనని ప్రజల్లో భయం నెలకొంది. చైనాలో ఈ వైరస్ బారిన పడ్డ వ్యక్తులు ఇప్పటికే వందకు పైగా మరణించారు. కాగా, ఈ వైరస్, కరోనా బ్రాండ్ పేరుతో ఉన్న బీరు అమ్మకాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతోంది.

ఈ బీరు తాగితే వైరస్ సోకుతుందా? అంటూ భారత్ లో బీరు ప్రియుల్లో అనుమానాలు తలెత్తుతున్నాయి. దీంతో ఆ బ్రాండ్ ను కొనుగోలు చేయటానికి వెనుకంజవేస్తున్నారు. దీనిపై తమ అనుమానాలను నివృత్తి చేసుకోవడానికి గూగూల్ ను ఆశ్రయిస్తున్నారు. కరోనా బీరు వైరస్, కరోనా బీరుతో వైరస్ సోకుతుందా? అని టైప్ చేస్తూ గూగుల్ లో వెతుకుతున్నారు. ఈ ప్రశ్నలను సంధిస్తున్న వారిలో భారత్ లోని కరోనా బ్రాండ్ బీరు ప్రియులతోపాటు, ఆస్ట్రేలియా, కెనడా, అమెరికా ప్రజలు కూడా ఉన్నారు.

  • Loading...

More Telugu News