Telugudesam: 'అమ్మఒడి' కోసం వసూళ్లు చేస్తున్నారు.. బిడ్డలూ, అమ్మలూ.. కాస్త జాగ్రత్త !: చంద్రబాబు

  • ‘అమ్మఒడి’ పేరిట అమ్మలను బెదిరిస్తున్నారు
  • ఒక్కొక్కరి నుంచి వెయ్యి రూపాయలు వసూలు
  • ఆ డబ్బు వైసీపీ నేతల జేబుల్లోకేనని ప్రజల ఆరోపణ

‘అమ్మఒడి’ పేరిట బెదిరించి వసూళ్లకు పాల్పడుతున్నారని వైసీపీ నాయకులపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఆరోపణలు చేస్తూ.. ‘బిడ్డలూ, అమ్మలూ.. కాస్త జాగ్రత్త!’ అని పిలుపు నిస్తూ వరుస ట్వీట్లు చేశారు.

‘అమ్మఒడి’ పేరిట అమ్మలను బెదిరించి ఒక్కొక్కరి నుంచి వెయ్యి రూపాయలు వసూళ్లు చేస్తున్నారంటూ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఆరోపించారు. ఆ వెయ్యి రూపాయలు తమకు ఇవ్వకపోతే ఈ పథకం కింద వచ్చే మొత్తం డబ్బును ఆపేస్తామని వైసీపీ నాయకులు బెదిరిస్తున్నారని ఆరోపిస్తూ వరుస ట్వీట్లు చేశారు.

వసూలు చేసిన డబ్బుకు రశీదు కూడా ఇవ్వడం లేదంటే ఆ డబ్బు చేరేది వైసీపీ నేతల జేబుల్లోకేనని ప్రజలు అనుకుంటున్నారని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ ఖర్చు పేరిట పిల్లల దగ్గర కమిషన్లు కొట్టేసే ‘దొంగమామలను’ ఇప్పుడే చూస్తున్నామంటూ సీఎం జగన్ పై చంద్రబాబు మండిపడ్డారు.

Telugudesam
Chandrababu
YSRCP
AmmaOdi
  • Error fetching data: Network response was not ok

More Telugu News