TRS: ఇంతటి అద్భుత విజయమందించిన ప్రజలకు టీఆర్ఎస్ రుణపడి ఉంటుంది: మంత్రి తలసాని

  • మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయంపై స్పందన
  • దేశ చరిత్రలో ఇంతటి ఘన విజయం ఏ పార్టీకి దక్కలేదు
  • పార్టీని తిడితే ఓట్లు పడవన్న విషయం ప్రతిపక్షాలు గుర్తుంచుకోవాలి

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ విజయకేతనం ఎగురవేయడంపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సంతోషం వ్యక్తం చేశారు. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో కలిసి ఇవాళ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, దేశ చరిత్రలో ఇంతటి ఘన విజయం ఏ పార్టీకి దక్కలేదని, ఇంతటి అద్భుత విజయాన్ని అందించిన ప్రజలకు తమ పార్టీ రుణపడి ఉంటుందని అన్నారు. ప్రభుత్వాన్ని, పార్టీని తిడితే ఓట్లు వేయరని, అభివృద్ధిని చూసి ప్రజలు ఆదరిస్తారన్న విషయాన్ని ప్రతిపక్ష పార్టీలు గుర్తుపెట్టుకోవాలని, ఇప్పటికైనా నీచ రాజకీయాలు చేయడం మానుకోవాలని హితవు పలికిన తలసాని, తెలంగాణ రాష్ట్రానికి టీఆర్ఎస్ పార్టీయే శ్రీరామరక్ష అని అన్నారు.

TRS
Talasani
Minister
Telgana municipal Elections
  • Loading...

More Telugu News