Telugudesam: ఐదు కోట్ల మంది ప్రజలను ఎంతగా బాధిస్తున్నాడో!: జగన్ పై కనకమేడల ఫైర్

  • ప్రజలను అధోగతిపాలు చేసి రోడ్లపైకి ఈడ్చారు
  • ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన సీఎం ఐదేళ్లు పదవిలోనే ఉంటారు
  • అందుకే, ప్రజలు భరిస్తున్నారు

ఏపీ సీఎం జగన్ పై టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడలో తెలుగుదేశం పార్లమెంటరీ సమావేశం ముగిసిన అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ, 'ఐదు కోట్ల మంది ప్రజలను ఆయన ఎంతగా బాధిస్తున్నాడో, వేధిస్తున్నాడో, హింసిస్తున్నాడో, నిద్రలు లేకుండా చేస్తున్నాడో.. ప్రజలను అధోగతి పాలు చేసి రోడ్ల మీదకు ఈడ్చారని దుమ్మెత్తిపోశారు. మరి ఐదుకోట్ల మంది ప్రజలు జగన్ ని రద్దు చేసేందుకు ఏ విధమైన చర్యలు తీసుకోవాలో' అంటూ వైసీపీ ప్రభుత్వం తీరుపై విరుచుకుపడ్డారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఒకసారి ఎన్నికైన తర్వాత ఐదేళ్ల పాటు పదవిలో ఉండక తప్పదు కనుక ప్రజలు భరిస్తున్నారని, లేకపోతే, జగన్ ని ప్రజలు ఎప్పుడో రద్దు చేసి ఉండేవారని అన్నారు.

Telugudesam
Kanakamedala Ravindra Kumar
mp
YSRCP
Jagan
cm
AP Legislative Council
  • Loading...

More Telugu News