Rashmika Mandanna: మొత్తానికి ఎన్టీఆర్ కు జోడీగా కూడా రష్మిక ఖరారైనట్టే

  • మహేశ్ తో హిట్ కొట్టిన రష్మిక 
  •  త్వరలో బన్నీతో కలిసి సెట్స్ పైకి
  • త్రివిక్రమ్ సినిమాలో అవకాశం  

కుర్ర హీరోలతో తన జర్నీ మొదలుపెట్టిన రష్మికకి, అదృష్టం కలిసొచ్చింది. దాంతో వరుస సినిమాలు వరిస్తున్నాయి .. వరుస సక్సెస్ లు దక్కుతున్నాయి. ఇటీవలే మహేశ్ జోడీగా ఆమె చేసిన 'సరిలేరు నీకెవ్వరు' భారీ విజయాన్ని అందించింది. సుకుమార్ తో బన్నీ చేయనున్న సినిమాలో కథానాయికగా ఛాన్స్ కొట్టేసింది.

ఈ నేపథ్యంలోనే ఆమెకి ఎన్టీఆర్ సరసన చేసే అవకాశం కూడా లభించిందని అంటున్నారు. 'అల వైకుంఠపురములో' సినిమాతో విజయాన్ని అందుకున్న త్రివిక్రమ్ తదుపరి సినిమాను ఎన్టీఆర్ తో చేయనున్నాడు. ఈ సినిమాలో కథానాయికగా రష్మిక అయితే బాగుంటుందనే ఉద్దేశంతో ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నారట. ఎన్టీఆర్ సరసన అవకాశాన్ని ఆమె ఎలాంటి పరిస్థితుల్లోను వదులుకోదు గనుక, ఈ సినిమాలో ఆమె ఖాయమైపోయినట్టేనని అంటున్నారు. త్వరలోనే ఈ విషయంలో స్పష్టత రానుంది.

Rashmika Mandanna
Junior NTR
Trivikram Srinivas
  • Loading...

More Telugu News