Telugudesam: ప్రజలంతా ఒకవైపు, సీఎం జగన్ ఒకవైపు ఉన్నారు: యనమల రామకృష్ణుడు

  • ఏపీలో రాక్షసరాజ్యం ఉంది తప్ప ప్రజారాజ్యం లేదు
  • ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రజలదే
  • వైసీపీ ప్రభుత్వానివి మూర్ఖపు నిర్ణయాలు

ఏపీలో రాక్షసరాజ్యం ఉంది తప్ప ప్రజారాజ్యం లేదని టీడీపీ ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు. ప్రజలంతా ఒకవైపు, సీఎం జగన్ ఒకవైపు ఉన్నారని విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని, ఆ పని చేయకపోతే భవిష్యత్తులో యువత నష్టపోతుందని అన్నారు.

టీడీపీ హయాంలో దేశంలో అభివృద్ధి చెందిన రాష్ట్రాల జాబితాలో మొదటి ఐదు స్థానాల్లో ఏపీ ఉండేదని, ఇప్పుడు మన రాష్ట్రం పరిస్థితి దిగజారిపోయిందని విమర్శించారు. ఏపీ రేటింగ్ పడిపోతే పెట్టబడిదారులు ఎవరూ తమ పెట్టుబడులు ఇక్కడ పెట్టేందుకు రారని అన్నారు. వైసీపీ ప్రభుత్వ మూర్ఖపు నిర్ణయాల వల్ల రాష్ట్రం నష్టపోతోందని, ప్రజలే రక్షించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు.

Telugudesam
Yanamala
YSRCP
Jagan
cm
  • Loading...

More Telugu News