YSRCP: 'వ్యక్తిగత హాజరు మినహాయింపు'పై తెలంగాణ హైకోర్టులో జగన్ పిటిషన్ పై విచారణ

  • జగన్ పిటిషన్లపై కౌంటర్ దాఖలుకు సీబీఐకు ఆదేశం
  • తదుపరి విచారణ ఫిబ్రవరి 6కు వాయిదా
  • వచ్చే శుక్రవారం జగన్ కు వ్యక్తిగత మినహాయింపు కోరిన న్యాయవాది

తనపై ఉన్న సీబీఐ కేసుల్లో వ్యక్తిగత హాజరు మినహాయింపు కోరుతూ తెలంగాణ హైకోర్టులో ఏపీ సీఎం జగన్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్ పై న్యాయస్థానం ఇవాళ విచారణ జరిపింది. జగన్ పిటిషన్లపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐను న్యాయస్థానం ఆదేశించింది. అనంతరం ఈ కేసు తదుపరి విచారణను ఫిబ్రవరి 6కు వాయిదా వేసింది.

ఇక వచ్చే శుక్రవారం కోర్టుకు హాజరు కాకుండా వ్యక్తిగత మినహాయింపు ఇవ్వాలని జగన్ తరఫు న్యాయవాది కోరారు. దీంతో హైకోర్టులో విచారణ జరుగుతున్న విషయాన్ని సీబీఐ కోర్టు దృష్టికి తీసుకెళ్లాలని న్యాయస్థానం సూచించింది. కాగా, జగన్ వ్యక్తిగత మినహాయింపు పిటిషన్ ను సీబీఐ కోర్టు ఇటీవల కొట్టివేసింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ హైకోర్టును జగన్ ఆశ్రయించారు.

YSRCP
Jagan
Telangana
High Court
CBI
  • Loading...

More Telugu News