Jagan: న్యాయస్థానాన్ని కూడా రద్దు చేస్తావా జగన్ రెడ్డి?: జనసేన
- హడావుడిగా రాజధాని తరలింపు చేయడం తప్పు అని కోర్టు తెలిపింది
- తెలుగు మాధ్యమం లేకుండా చేయడం సరికాదని చెప్పింది
- ప్రభుత్వ కార్యాలయాలకి రంగులేసుకునే కార్యక్రమాన్ని తప్పుబట్టింది
ఆంధ్రప్రదేశ్ శాసన మండలిని రద్దు చేయాలంటూ అసెంబ్లీలో తీర్మానం చేసిన ఏపీ సీఎం జగన్‌పై జనసేన పార్టీ విమర్శలు గుప్పించింది. 'న్యాయస్థానాన్ని కూడా రద్దు చేస్తావా జగన్ రెడ్డి?' అని ప్రశ్నిస్తూ ట్విట్టర్‌లో విమర్శలు గుప్పించింది. ఎనిమిది నెలల్లో జగన్ తీసుకున్న నిర్ణయాలను వివరిస్తూ ఆయన తీరు సరికాదని హితవు పలికింది.
'హడావుడిగా రాజధాని తరలింపు చేయడం తప్పు అని కోర్టు తెలిపింది. తెలుగు మాధ్యమం లేకుండా చేయడం సరికాదని చెప్పింది. ఉద్యమంలా చేపట్టిన ప్రభుత్వ కార్యాలయాలకి రంగులేసుకునే కార్యక్రమాన్ని తప్పుబట్టింది. నియంత ధోరణిలో నువ్వు తీసుకుంటోన్న నిర్ణయాలను తప్పుబడుతోందని న్యాయస్థానాన్ని కూడా రద్దు చేస్తావా జగన్ రెడ్డి?' అంటూ జనసేన ప్రశ్నించింది.