Jagan: 151 సీట్లు వచ్చాయని విర్రవీగితే...: జగన్‌కు కన్నా లక్ష్మీ నారాయణ హెచ్చరిక

  • ప్రజలు సరైన గుణపాఠం చెబుతారు
  • అసెంబ్లీ నిర్ణయాల్లో లోపాలు ఉంటే సెలెక్ట్‌ కమిటీకి పంపడం సాధారణ ప్రక్రియ 
  • మండలికి ఖర్చు వృథానా?
  • అయితే మీ ప్రచారాల కోసం చేస్తోన్న ఖర్చులు వృథా కాదా?  

శాసన మండలి రద్దు నిర్ణయం సీఎం జగన్ సహజ ధోరణికి నిదర్శనమని బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. 151 సీట్లు వచ్చాయని విర్రవీగితే ప్రజలు సరైన గుణపాఠం చెబుతారని ఆయన హెచ్చరించారు. అసెంబ్లీ నిర్ణయాల్లో లోపాలు ఉంటే సెలెక్ట్‌ కమిటీకి పంపడం సాధారణ ప్రక్రియని ఆయన చెప్పారు.

మండలికి ఖర్చు వృథా అయితే మీ ప్రచారాల కోసం చేస్తోన్న ఖర్చులు వృథా కాదా? అని జగన్‌ను కన్నా లక్ష్మీ నారాయణ ప్రశ్నించారు. పార్టీ కార్యకర్తలకు వాలంటీర్ల పేరుతో ఇచ్చే జీతాల సంగతేంటీ? అని నిలదీశారు. అలాగే, వైసీపీ తమ సలహాదారులకు ఇచ్చే వేతనాల సంగతేంటని ప్రశ్నించారు. బిల్లుల విషయంలో ప్రభుత్వ నిర్ణయంపై మండలిలో బీజేపీ సభ్యులు కూడా నిరసన తెలిపారని, ఆ మాత్రానికే మండలి రద్దు నిర్ణయం తీసుకుంటారా? అని నిలదీశారు.

  • Loading...

More Telugu News