Surya: దాని కోసం ఎక్కువ సినిమాల్లో నటించి బాగా సంపాదిస్తా: సూర్య

  • అగరం ఫౌండేషన్ ద్వారా విద్యాసేవ చేస్తున్న సూర్య
  • 10వ వార్షికోత్సవాన్ని జరుపుకున్న అగరం
  • తమ సేవలు నిరంతరం కొనసాగుతాయని సూర్య వ్యాఖ్య

ఇతరులకు సాయం చేస్తేనే మన జీవితం పరిపూర్ణమవుతుందని సినీ హీరో సూర్య అన్నారు. తమ సంస్థ 'అగరం ఫౌండేషన్' తరపున చేస్తున్న విద్యాసేవ నిరంతరాయంగా కొనసాగుతుందని చెప్పారు. విద్యార్థుల చదువు, ఉద్యోగానికి సంబంధించి వారు సాధించేదే తమ ఫౌండేషన్ విజయమని అన్నారు. విద్యాసేవ కోసం ఎక్కువ సినిమాల్లో నటించి బాగా సంపాదిస్తానని చెప్పారు. అగరం ఫౌండేషన్ 10వ వార్షికోత్సవం చెన్నైలో జరిగింది. ఈ కార్యక్రమానికి సూర్యతో పాటు ఆయన సోదరుడు, హీరో కార్తీ, తండ్రి శివకుమార్, పలువురు విద్యావేత్తలు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా సూర్య మాట్లాడుతూ పైమేరకు వ్యాఖ్యానించారు.

శివకుమార్ మాట్లాడుతూ సూర్య, కార్తీలు ఎన్ని సినిమాల్లో నటించినా, ఎన్ని కోట్లు సంపాదించినా వారి కేరాఫ్ అడ్రస్ అగరం, ఉళవన్ సంస్థలు మాత్రమేనని చెప్పారు.

Surya
Kolliwood
Agara Foundation
  • Loading...

More Telugu News