BJP: విజయవాడలో బీజేపీ, జనసేన నేతల కీలక భేటీ

  • బీజేపీ నుంచి పురందేశ్వరి, సోము వీర్రాజు, శాంత రెడ్డి హాజరు 
  • జనసేన నుంచి నాదెండ్ల మనోహర్, బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ హాజరు
  • రాజధాని అంశంపై చర్చ

విజయవాడలో బీజేపీ, జనసేన పార్టీ సమన్వయ కమిటీ సమావేశమైంది. ఏపీలో చోటు చేసుకుంటోన్న తాజా రాజకీయ పరిణామాలు, తమ కార్యచరణ ప్రణాళికపై నేతలు చర్చించనున్నారు. బీజేపీ నుంచి పురందేశ్వరి, సోము వీర్రాజు, శాంత రెడ్డితో పాటు పలువురు నేతలు ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. అలాగే, జనసేన నుంచి నాదెండ్ల మనోహర్, బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, శివశంకర్, కందుల దుర్గేశ్, చిలకం మధుసూదన రెడ్డి తదితరులు పాల్గొంటున్నారు.

మరోవైపు, విజయవాడలోనే తమ పార్టీ కార్యాలయంలో నిన్న జనసేన నేతలతో ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ నిన్న సమావేశమై రాజధాని అంశంపై చర్చించారు. రాజధాని రైతుల తరఫున పోరాడతామని ఇప్పటికే బీజేపీ, జనసేన ప్రకటించాయి. ఈ రోజు భేటీలో ఈ విషయంపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను జనసేన నేతలు పవన్ కల్యాణ్‌కు వివరించి, అనంతరం రాజధాని పోరాటంపై కార్యాచరణ ప్రణాళిక గురించి ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

BJP
Janasena
Amaravati
Vijayawada
  • Loading...

More Telugu News