Sudheer Babu: నాని ఫస్టులుక్ తో మరింత ఆసక్తిని పెంచుతున్న 'వి'

  • విభిన్నమైన కథాకథనాలతో 'వి'
  • విలక్షణమైన పాత్రలో నాని 
  • మార్చి 25వ తేదీన విడుదల

ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో 'వి' సినిమా రూపొందుతోంది. సుధీర్ బాబు - నాని ప్రధానమైన పాత్రలను పోషిస్తున్నారు. ఈ సినిమాకి సుధీర్ పాత్ర రక్షకుడిగా ఉంటుందనీ, నాని పాత్ర రాక్షసుడిగా ఉంటుందని ముందుగానే తెలియజేశారు. అలాగే రక్షకుడిగా నిన్న సుధీర్ బాబు పోస్టర్ ను వదిలారు. ఆ లుక్ మంచి మార్కులను కొట్టేసింది.

ఇక రాక్షసుడిగా ఈ రోజున నాని ఫస్టులుక్ ను వదిలారు. రక్తం మరకలు అంటిన కత్తెరను చేతిలో పట్టుకున్న నాని, దుర్మార్గపు ఆలోచన ఏదో ఆచరణలో పెట్టినట్టుగా కనిపిస్తున్నాడు. నాని లుక్ తో సినిమాపై మరింతగా ఆసక్తి ఏర్పడటం .. అంచనాలు పెరగడం ఖాయంగా అనిపిస్తోంది. 'దిల్' రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకి, అమిత్ త్రివేది సంగీతాన్ని సమకూర్చాడు. నివేదా థామస్ .. అదితీరావు హైదరి కథానాయికలుగా నటిస్తున్న ఈ సినిమాను మార్చి 25వ తేదీన విడుదల చేయనున్నారు.

Sudheer Babu
Nani
Indraganti
V Movie
  • Loading...

More Telugu News