Telugudesam: అసెంబ్లీలో ఉన్న మా సోదర వైసీపీ ఎమ్మెల్యేలకు కూడా చెబుతున్నా..: టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల

  • ప్రజాస్వామ్యానికి మూల స్తంభం చర్చలు 
  • ఏపీ ప్రజాస్వామ్యంలో తొలి నియంత జగన్
  • ఈ రోజున మండలికి పట్టిన గతే రేపు అసెంబ్లీకీ పట్టొచ్చు

ప్రజాస్వామ్యాన్ని అర్థం చేసుకోలేని పరిస్థితిలో జగన్ ఉన్నారని టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు విమర్శించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రజాస్వామ్యానికి మూల స్తంభం చర్చలు, సంప్రదింపులు అని, భిన్నాభిప్రాయలను పరిగణనలోకి తీసుకోవాలని, వీటన్నింటినీ అంగీకరించాలని, అందులో ఉన్న మంచిని స్వీకరించాలని సూచించారు.

మొట్టమొదటిసారిగా ఏపీ ప్రజాస్వామ్యంలో ఒక నియంతను జగన్ లో చూస్తున్నామని విమర్శించారు. బెదిరించడం, దాదాగిరి చేయడం జగన్ పాలసీ అని, వీటికి తమ ఎమ్మెల్సీలు లొంగలేదన్న కక్షతో మండలి రద్దు నిర్ణయం చేశారని నిప్పులు చెరిగారు. ‘అసెంబ్లీలో ఉన్న మా సోదర వైసీపీ ఎమ్మెల్యేలకు కూడా చెబుతున్నాను.. ఈ తుగ్లక్ పాలనలో రేపు ఎప్పుడైనా అసెంబ్లీలో ఆయన అభిప్రాయాన్ని వ్యతిరేకిస్తే ఈ రోజున మండలికి పట్టిన గతే రేపు అసెంబ్లీకి కూడా పడుతుంది’ అని విమర్శించారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News