Relangi Narasimha Rao: జంధ్యాల గారి సినిమాలకి, నా సినిమాలకి తేడా అదే: దర్శకుడు రేలంగి నరసింహారావు

  • జంధ్యాల సినిమాలు ప్రేమికులపై ఉంటాయి 
  •  నా సినిమాలు భార్యాభర్తల బంధంపై ఉంటాయి 
  • ఇప్పుడు ఈ తరహా సినిమాలు తక్కువన్న రేలంగి  

ఫ్యామిలీ ఎమోషన్స్ ను కామెడీతో కలిపి నడిపించే దర్శకుడిగా రేలంగి నరసింహారావుకి మంచి పేరు వుంది. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, తన సినిమాలను గురించి ప్రస్తావించారు . "జంధ్యాలగారి మాదిరిగానే నేను కూడా హాస్యభరిత చిత్రాలనే ఎక్కువగా తెరకెక్కించాను. అయితే జంధ్యాలగారి సినిమాలకి .. నా సినిమాలకి మధ్య తేడా వుంది. ఆయన సినిమాలు ప్రేమికులపై ఎక్కువగా ఉంటాయి. నా సినిమాలు భార్యాభర్తల బంధంపై ఉంటాయి.

నా సినిమాల టైటిల్స్ లోనే అది భార్యాభర్తల కథ అని తెలిసిపోతుంది. 'ఇద్దరు పెళ్లాల ముద్దుల పోలీసు' .. 'ఎదురింటిమొగుడు పక్కింటి పెళ్లాం' .. 'పోలీస్ భార్య' .. 'పెళ్లానికి ప్రేమలేఖ ప్రియురాలికి శుభలేఖ' ..' నేను మా ఆవిడ'.. 'ఏవండోయ్ శ్రీమతిగారు' ఇలా వుండేవి. ఫ్యామిలీతో కలిసి చూడదగినవిగా నా సినిమాలు ఉండేవి. ఇప్పుడు అలాంటి సినిమాలు తక్కువగా వస్తున్నాయి" అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

Relangi Narasimha Rao
Jandhyala
Comedy Movies
  • Loading...

More Telugu News