'జబర్దస్త్' నుంచి నాగబాబుగారు వెళ్లడం బాధించింది: కమెడియన్ అప్పారావ్
- నాగబాబుగారికి 'జబర్దస్త్' అంటే ఇష్టం
- గొంతు ఇన్ఫెక్షన్ వచ్చినా మానలేదు
- ఆవైపు నుంచి ఆయన క్లారిటీ ఇచ్చారన్న అప్పారావ్
అందువల్లనే ఆ మధ్య చాలా తీవ్రంగా గొంతు ఇన్ఫెక్షన్ వచ్చినప్పటికీ ఆయన మానుకోలేదు. ఆయన ఈ షోను ఎంతగా ప్రేమించారనడానికి ఇదో నిదర్శనం. అలాంటిది ఆయన ఈ షో నుంచి ఎందుకు తప్పుకున్నారనేది నాకు తెలియదు. తాను ఈ షో నుంచి తప్పుకోవడానికి గల కారణం పారితోషికం మాత్రం కాదని నాగబాబుగారే చెప్పారు. అందువలన ఆ వైపు నుంచి ఎలాంటి సందేహం లేనట్టే. ఏదేవైనా ఆయన ఈ షో నుంచి తప్పుకోవడం బాధ కలిగించే విషయమే" అని చెప్పుకొచ్చాడు.