Jagan: అక్రమాస్తుల కేసులో హైకోర్టును ఆశ్రయించిన సీఎం జగన్

  • సుదీర్ఘకాలంగా సీఎం జగన్ పై సీబీఐ విచారణ
  • వ్యక్తిగత హాజరు మినహాయింపు కోరిన జగన్
  • జగన్ పిటిషన్ తోసిపుచ్చిన సీబీఐ న్యాయస్థానం
  • హైకోర్టులో తాజాగా పిటిషన్ దాఖలు

అక్రమాస్తుల కేసులో సీఎం జగన్ సుదీర్ఘకాలంగా సీబీఐ విచారణ ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. సీఎం అయ్యాక వ్యక్తిగత హాజరు మినహాయింపు కోరుతూ పిటిషన్ దాఖలు చేయగా, సీబీఐ న్యాయస్థానంలో ఆయనకు చుక్కెదురైంది. దాంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. సీబీఐ కేసుల్లో కోర్టు విచారణకు వ్యక్తిగత హాజరు మినహాయింపు కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. సీఎంగా పాలనా విధులు నిర్వర్తించాల్సిన బాధ్యత ఉందని తన పిటిషన్ లో పేర్కొన్నారు.

Jagan
High Court
CBI
Disproportionate Assets Case
Andhra Pradesh
CM
  • Loading...

More Telugu News