Telugudesam: వ్యవస్థలను మర్డర్ చేయడంలోనూ సీఎం జగన్ సిద్ధహస్తులు: టీడీపీ నేత నిమ్మల ఆగ్రహం

  • శాసనమండలి రద్దు నిర్ణయం దారుణం
  • దీనికి కేబినెట్ ను వేదికగా చేసుకుంటారా?
  • ఒక శాసనసభ్యుడిగా సిగ్గుపడుతున్నా

వ్యవస్థల గొంతు నొక్కడమే కాదు, వ్యవస్థలను మర్డర్ చేయడంలో కూడా సీఎం జగన్, వైసీపీ మంత్రులు సిద్ధహస్తులంటూ టీడీపీ ఎమ్మెల్యే రామానాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈరోజు మీడియాతో మాట్లాడుతూ, శాసనమండలిని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడం దారుణమైన విషయమని, దీనికి కేబినెట్ ను వేదికగా చేసుకోవడాన్ని ఒక శాసనసభ్యుడిగా సిగ్గుపడుతున్నానని అన్నారు. శాసనమండలిని రద్దు చేయడమంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల గొంతు నొక్కడమేనని, వారిపై కక్ష సాధించడమేనని, వారిపై దాడి చేయడంతో సమానమని విమర్శించారు. శాసనమండలిలో టీడీపీకి, వైసీపీ సభ్యుల్లో అత్యధిక శాతం మంది బడుగు బలహీనవర్గాలకు చెందిన వారేనని అన్నారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News