Sejal Sharma: చనిపోయింది నేను కాదు.. మరో సెజల్ శర్మ: టీవీ నటి సెజల్ శర్మ స్పష్టీకరణ

  • టీవీ నటి ఆత్మహత్య
  • మరో నటి ఫొటోతో మీడియా ప్రచారం
  • ఆవేదన వ్యక్తం చేసిన సెజల్

ఇటీవల సెజల్ శర్మ అనే బుల్లితెర నటి ఆత్మహత్య చేసుకుందన్న విషయం మీడియాలో ప్రముఖంగా దర్శనమిచ్చింది. ఆ యువనటి ఫొటోలతో సహా మీడియాలో కథనాలు వచ్చాయి. ఇప్పుడా వ్యవహారం ఆసక్తికరమైన మలుపు తిరిగింది.

 చనిపోయింది మరో సెజల్ శర్మ అని, తన ఫొటో పెట్టి ఎందుకు రాశారంటూ ఇంకో సెజల్ శర్మ తెరపైకి వచ్చింది. నేను చచ్చిపోలేదు, బతికే ఉన్నాను అంటూ సెజల్ ఇన్ స్టాగ్రామ్ లో వెల్లడించడంతో అభిమానులు దిగ్భ్రమకు గురయ్యారు. సెజల్ శర్మ అనే పేరున్న మరో నటి మరణిస్తే, తాను చనిపోయినట్టు ప్రచారం చేశారని, తాను క్షేమంగా ఉన్నానని వివరించింది. మీడియా వాళ్లను చూస్తుంటే పిచ్చి పడుతోంది. వాస్తవాలు తెలుసుకోవద్దా! నా ఫొటోతో ఎలా ప్రసారం చేస్తారు? అంటూ మండిపడింది.

Sejal Sharma
Sezal Sharma
Suicide
TV Actress
  • Loading...

More Telugu News