Telugudesam: టీడీపీపై జగన్ కక్షకు నిదర్శనం మండలి రద్దు నిర్ణయమే : నక్కా ఆనందబాబు ఫైర్

  • మండలిలో రెండు బిల్లులు పాస్ కాలేదని జగన్ అక్కసు
  • సీఎం జగన్ నియంతలా పాలిస్తే కుదరదు
  • జగన్ పాలనలో పోలీస్ వ్యవస్థను నాశనం చేశారు

ఏపీ సీఎం జగన్ పై టీడీపీ నేత నక్కా ఆనందబాబు మండిపడ్డారు. ప్రజల బాధలు, సమస్యలు తెలుసుకుని పరిపాలించాలి గానీ ఓ నియంతలా పరిపాలన సాగిస్తే కుదరదని సీఎం జగన్ ని హెచ్చరించారు. టీడీపీపై జగన్ కక్ష ఎలా ఉంటుందనేందుకు నిదర్శనం మండలి రద్దు నిర్ణయమే అని విమర్శించారు. మండలిలో ప్రవేశపెట్టిన రెండు బిల్లులు పాస్ కాలేదన్న అక్కసుతోనే కౌన్సిల్ ను రద్దు చేస్తున్నారని విమర్శించారు. మండలి రద్దయ్యేవరకు దాని కార్యాచరణ అది చేసుకుంటూపోతుందని అన్నారు. రాజధాని రైతులపై పోలీసుల దాడుల పట్ల ఆయన మండిపడ్డారు. జగన్ పాలనలో పోలీస్ వ్యవస్థను నాశనం చేశారని విమర్శించారు.

Telugudesam
Nakka Anandh Babu
Jagan
cm
  • Loading...

More Telugu News