BJP: శాసనమండలిని తండ్రి తెస్తే.. కొడుకు రద్దు చేస్తున్నారు: ఎమ్మెల్సీ మాధవ్

  • రద్దు విషయంలో కేంద్రం జోక్యం చేసుకునే అవకాశం లేదు
  • ఈ విషయంలో వైసీపీ, టీడీపీ పార్టీలు దోషులే  
  • రాష్ట్రపతి ఆర్డర్ వచ్చే వరకూ మండలి కొనసాగుతుంది

ఆంధ్రప్రదేశ్ లో శాసనమండలి రద్దు తీర్మానం ప్రవేశపెట్టడంపై అటు టీడీపీ, ఇటు బీజేపీ పార్టీల నేతలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. తండ్రి శాసనమండలిని ఏర్పాటుచేస్తే.. కుమారుడు జగన్ దాన్ని రద్దు చేస్తున్నారని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ వ్యాఖ్యానించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి తెచ్చిన మండలిని తనయుడు జగన్ రద్దు చేయడం దురదృష్టకరమన్నారు.

శాసన మండలి రద్దు విషయంలో.. వైసీపీ, టీడీపీ పార్టీలు దోషులేనని ఆయన వ్యాఖ్యానించారు. రద్దు విషయంలో కేంద్రం జోక్యం చేసుకునే అవకాశం లేదన్నారు. మండలి రద్దుకు కొంచెం సమయం పట్టచ్చన్నారు. దీనిపై న్యాయపోరాటం చేసే అవకాశముందని, రాష్ట్రపతి ఆర్డర్ వచ్చే వరకూ మండలి కొనసాగుతుందని అన్నారు.

BJP
Andhra Pradesh
MLC
Madhav
AP Legislative Council
Abolition
  • Loading...

More Telugu News