Bhumana Karunakar Reddy: చంద్రబాబును నక్షత్రకుడితో పోల్చిన భూమన!

  • చంద్రబాబు ప్రతి దానికీ అడ్డుపడుతున్నారు
  • టీడీపీ సభ్యులు సైంధవుల్లా తయారయ్యారు
  • టీడీపీ ఎమ్మెల్సీలను చంద్రబాబు ఉసిగొల్పుతున్నారు

మండలి రద్దు అంశంపై ఏపీ అసెంబ్లీలో చర్చ నిర్వహించగా వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడారు. ఏపీ సీఎం జగన్ ప్రజాక్షేమం కోసం పనిచేస్తుంటే చంద్రబాబు, టీడీపీ నేతలు ప్రతిదానికి అడ్డుపడుతున్నారని మండిపడ్డారు. జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చంద్రబాబు చికాకు పెడుతున్నారని, విశ్వామిత్రుడి అనుయాయి నక్షత్రకుడు ఏ విధంగానైతే సత్యహరిశ్చంద్రుడ్ని పీడిస్తుంటాడో చంద్రబాబు కూడా అదేవిధంగా జగన్ ను పీడిస్తున్నారని ఆరోపించారు.

అంతకుముందు ఆయన మహాభారతంలోని జయద్రథుడి గురించి ప్రస్తావించారు. సైంధవ రాజ్య యువరాజు కావడంతో జయద్రథుడ్ని సైంధవుడు అని కూడా అంటారని, ఇప్పుడు టీడీపీ సభ్యులు కూడా సైంధవుల్లా తయారయ్యారని విమర్శించారు. నాడు సైంధవుడ్ని కౌరవులు పురికొల్పినట్టుగా, నేడు చంద్రబాబు టీడీపీ ఎమ్మెల్సీలను బిల్లులు అడ్డుకునేందుకు ఉసిగొల్పుతున్నారని వ్యాఖ్యానించారు.

Bhumana Karunakar Reddy
Chandrababu
Nakshatrakudu
Telangana
MLC
Saindhavudu
AP Legislative Council
Abolition
  • Loading...

More Telugu News