Relangi Narasimha Rao: రేలంగి గారు మాకు బంధువే: దర్శకుడు రేలంగి నరసింహారావు

  • 'రాధమ్మపెళ్లి'కి నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా చేశాను
  • రేలంగి గారు ఆప్యాయంగా మాట్లాడారు 
  • ఆయన అలా అనేవారన్న దర్శకుడు

హాస్య కథా చిత్రాల దర్శకుడిగా రేలంగి నరసింహారావుకి ఎంతోమంచి పేరుంది. తక్కువ బడ్జెట్ లో సినిమాలను పూర్తి చేసి ఎక్కువ లాభాలను తెచ్చిపెట్టే దర్శకుడిగా ప్రత్యేకత వుంది. అలాంటి రేలంగి నరసింహారావు తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ .. "రేలంగి అనేది మా ఇంటిపేరు .. హాస్య నటుడు రేలంగి గారితో బంధుత్వం కూడా వుంది. వరుసకు నాకు ఆయన పెదనాన్న అవుతారు.

అయితే చిత్రపరిశ్రమకి నేను వచ్చిన తరువాతనే ఆయనను కలిశాను. దాసరిగారు దర్శకత్వం వహించిన 'రాధమ్మపెళ్లి' సినిమాకి నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాను. ఆ సినిమా షూటింగ్ సమయంలోనే నేను రేలంగి గారిని కలిశాను. నాతో ఆయన ఎంతో ఆప్యాయంగా మాట్లాడారు. 'దాసరి గారు నిన్ను తిడుతుంటే, అందరూ నన్ను తిడుతున్నాడని అనుకుంటున్నారయ్యా. ఈ ఒక్క సినిమా వరకైనా 'రేలంగి' అని కాకుండా నరసింహారావు అని పిలిపించుకోవయ్యా' అని రేలంగి అనేవారు" అని చెబుతూ నవ్వేశారు.

Relangi Narasimha Rao
Relangi
Radhamma Pelli Movie
  • Loading...

More Telugu News