Vangaveeti Radha: మాట నెగ్గించుకోవడానికి జగన్ ఎంతవరకైనా వెళతారు: వంగవీటి రాధా

  • తుళ్లూరులో రైతుల దీక్షకు మద్దతు పలికిన రాధా
  • రాజధాని రాష్ట్ర ప్రజలందరి సమస్య అని వెల్లడి
  • వెలగపూడిలో దీక్షా శిబిరంలో కూర్చున్న రాధా

ఏపీ రాజధాని అమరావతి కోసం తుళ్లూరులో నేడు కూడా రైతుల దీక్షలు కొనసాగుతున్నాయి. తాజాగా, బెజవాడ టీడీపీ నేత వంగవీటి రాధా తుళ్లూరులో రైతుల ధర్నాకు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మాట నెగ్గించుకోవడానికి జగన్ ఎంతవరకైనా వెళతాడని వ్యాఖ్యానించారు. ఇప్పుడు శాసనమండలి రద్దు అంశం కూడా ఈ కోవకే చెందుతుందని తెలిపారు. దిగువ సభలో పొరబాట్లకు తావులేకుండా చూడడం కోసం పెద్దల సభను ఏర్పాటు చేశారని ఆయన అన్నారు.

రాజన్న రాజ్యమంటే ఇంతమంది రైతులను పొట్టనబెట్టుకోవడమా? అంటూ మండిపడ్డారు. రాజధాని సమస్య అనేది రాష్ట్ర ప్రజలందరిదీనని, పార్టీలు, కులమతాలకు అతీతంగా ఉద్యమం సాగుతుందని పేర్కొన్నారు. ఉద్యమాన్ని ఉద్ధృతం చేసేలా త్వరలో కార్యాచరణ ఉంటుందని రాధా వెల్లడించారు. ఈ క్రమంలో వెలగపూడి కూడా వెళ్లిన రాధా అక్కడి దీక్షా శిబిరంలో కూర్చుని రైతులకు మద్దతు ప్రకటించారు.

Vangaveeti Radha
Jagan
AP Legislative Council
Amaravati
Farmers
Tulluru
Velagapudi
  • Loading...

More Telugu News