Vijay Sai Reddy: జగన్ మొండి మనిషి కాబట్టి సరిపోయింది... లేకపోతేనా..!: విజయసాయిరెడ్డి

  • జగన్ గేట్లు తెరిస్తే అంతా జంప్ అయ్యేవాళ్లన్న విజయసాయి
  • టీడీపీపై పరోక్ష వ్యాఖ్యలు
  • మంత్రి పదవి ఇస్తామంటే మాలోకాన్ని కూడా పంపించేవాడంటూ బాబుపై విసుర్లు

శాసనమండలి రద్దు నిర్ణయం నేపథ్యంలో అధికార, విపక్ష నేతల మధ్య మాటల యుద్ధం ముదిరింది. ఒకరిపై ఒకరు వాగ్బాణాలు విసురుకుంటున్నారు. ఈ క్రమంలో, వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ విలువలకు కట్టుబడిన మొండి మనిషి కాబట్టి సరిపోయిందని, ఆయన గనుక పార్టీ గేట్లు తెరిచి ఉంటే ఈపాటికి అంతా జంప్ అయ్యేవాళ్లని పరోక్షంగా టీడీపీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. మంత్రి పదవి ఆఫర్ చేస్తే ఆఖరికి మాలోకాన్ని కూడా పంపించి కేసుల నుంచి తప్పించుకోవాలని చూసేవాడు అంటూ చంద్రబాబుపైనా సెటైర్ వేశారు. 

Vijay Sai Reddy
Jagan
Party
AP Legislative Council
Chandrababu
Nara Lokesh
  • Loading...

More Telugu News