Kobe Briant: కోబ్ బ్రయాంట్ దుర్మరణంతో దిగ్భ్రాంతికి గురైన క్రీడా దిగ్గజాలు

  • హెలికాప్టర్ ప్రమాదంలో కన్నుమూసిన బాస్కెట్ బాల్ దిగ్గజం
  • ప్రమాదంలో కోబ్ కుమార్తె కూడా మృతి
  • తీవ్ర విషాదంలో క్రీడా ప్రపంచం

అమెరికా బాస్కెట్ బాల్ చరిత్రలో తిరుగులేని ఆటగాడిగా ఖ్యాతి పొందిన కోబ్ బ్రయాంట్ హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం పాలవడం క్రీడా ప్రపంచాన్ని తీవ్ర విషాదంలో ముంచెత్తింది. ఈ ప్రమాదంలో కోబ్ కుమార్తె గియాన్నా కూడా మృతి చెందడం ఆయన అభిమానులకు గుండెకోతగా మారింది.

కోబ్ మరణవార్తతో ప్రపంచ క్రీడా ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. కోబ్ బ్రయాంట్ కుమార్తె సహా మరణించాడని తెలిసి తీవ్ర విషాదానికి లోనయ్యానని భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ స్పందించారు. టెన్నిస్ గ్రేట్ నోవాక్ జకోవిచ్ సైతం కోబ్ మరణం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశాడు. గొప్పమార్గదర్శి, మిత్రుడు ఇక లేనందుకు నా హృదయం నిజంగా రోదిస్తోంది అంటూ జకోవిచ్ ట్వీట్ చేశాడు. అటు క్రికెటర్ కేఎల్ రాహుల్ కూడా సంతాపంగా ట్వీట్ చేశాడు.

Kobe Briant
Basketball
Helicopter Crash
Daughter
Sachin Tendulkar
Novak
  • Loading...

More Telugu News