Rajanikanth: రజనీ కొత్త మూవీ టైటిల్ గా 'అన్నాత్త'

  • సెట్స్ పై రజనీ 168వ సినిమా 
  • టైటిల్ ను ఖరారు చేసిన దర్శకుడు 
  • కీలకమైన పాత్రలో కీర్తి సురేశ్

ఒక వైపున తమిళనాట 'దర్బార్' వసూళ్ల జోరును కొనసాగిస్తూ ఉండగానే, మరో వైపున తదుపరి సినిమాకి సంబంధించిన పనులతో రజనీ బిజీగా వున్నారు. ఆయన 168వ సినిమాకి శివ దర్శకత్వం వహిస్తున్నాడు. అజిత్ కి వరుస విజయాలు ఇచ్చిన శివపై రజనీ అభిమానులు గట్టి నమ్మకాన్నే పెట్టుకున్నారు.

ఈ సినిమాకి 'అన్నాత్త' అనే టైటిల్ ను ఖరారు చేసినట్టుగా తెలుస్తోంది. అధికారికంగా ఈ విషయాన్ని ధ్రువీకరించవలసి వుంది. రజనీకాంత్ సరసన ఖుష్బూ .. మీనా నటిస్తుండగా, ఒక కీలకమైన పాత్రలో కీర్తి సురేశ్ కనిపించనుందని అంటున్నారు. సన్ పిక్చర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాలో రజనీకాంత్ డిఫరెంట్ లుక్ తో కనిపించనున్నారనీ, కెరియర్లో చెప్పుకోదగిన పాత్రల్లో ఒకటి ఆయన ఈ సినిమాలో చేస్తున్నారని అంటున్నారు.

Rajanikanth
Khushbu
Meena
Keerthi Suresh
  • Loading...

More Telugu News