AP Legislative Council: ఏపీ శాసనమండలి రద్దు నిర్ణయం... నిమిషాల్లో ముగిసిన జగన్ క్యాబినెట్ సమావేశం!

  • జగన్ నేతృత్వంలో సమావేశమైన క్యాబినెట్
  • మండలి రద్దు అంశాన్ని ప్రతిపాదించిన పిల్లి సుభాష్ చంద్రబోస్
  • ఒకరిద్దరు అభ్యంతరం చెప్పినా, రద్దుకే మొగ్గు

ఈ ఉదయం సమావేశమైన ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్, శాసనమండలిని రద్దు చేయాలని నిర్ణయించింది. జగన్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి దాదాపు అందరు మంత్రులూ హాజరుకాగా, నిమిషాల్లోనే ఈ సమావేశం ముగియడం గమనార్హం. మండలి రద్దు అంశాన్ని పిల్లి సుభాష్ చంద్రబోస్ లేవనెత్తగా, కొందరు సీనియర్ మంత్రులు మాత్రం కొన్ని సూచనలు చేసినట్టు సమాచారం.

మరో ఏడాదిలో ఎలాగైనా మండలిలో బలం పెరుగుతుందని, పదవులు లేని పార్టీ నేతలకు స్థానం కల్పించవచ్చని, వారు చెప్పగా, అప్పటికే రద్దుపై ఓ నిర్ణయానికి వచ్చేసిన సీఎం, బిల్లులను అడ్డుకునే సభలు ఎందుకని ప్రశ్నించినట్టు తెలుస్తోంది. దీంతో మంత్రులంతా ఆయన నిర్ణయానికి ఆమోదం పలికారు. మరికాసేపట్లో అసెంబ్లీలో మండలి రద్దుపై చర్చ సాగనుంది.

AP Legislative Council
Disolve
Jagan
Cabinet
  • Loading...

More Telugu News