USA: అమెరికా క్రీడా చరిత్రలోనే అత్యంత విషాదం: ట్రంప్

  • హెలికాప్టర్ ప్రమాదంలో కోబ్ బ్రియాంట్ మృతి
  • బ్రియాంట్ కూతురు కూడా మృతి
  • విచారం వ్యక్తం చేసిన డొనాల్డ్ ట్రంప్

వరల్డ్ బాస్కెట్ బాల్ స్టార్, ఎన్బీఏ లెజండ్ కోబ్ బ్రియాంట్ మృతిపట్ల పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. లాస్ ఏంజిల్స్ శివారులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో బ్రియాంట్, ఆయన 13 ఏళ్ల కూతురు గియానా సహా 9 మంది దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే. యూఎస్ ఓ దిగ్గజ ఆటగాడిని కోల్పోయిందని ట్రంప్ విచారం వ్యక్తం చేశారు. దేశంలో బాస్కెట్ బాల్ విస్తరణ, అభివృద్ధికి బ్రియాంట్ ఎంతో కృషి చేశారని గుర్తు చేసుకున్న ట్రంప్, ఈ దుర్ఘటన అమెరికా క్రీడా చరిత్రలోనే అత్యంత విషాదకరమైనదని అన్నారు.

USA
Kobe Briyant
KTR
Donald Trump
Basket ball
  • Loading...

More Telugu News